calender_icon.png 27 July, 2025 | 4:20 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

యాదవ సంఘ భవనానికి భూమి పూజ

26-07-2025 06:40:28 PM

రాజ్యసభ సభ్యుడు సురేష్ రెడ్డి నిధులతో 5 లక్షలు మంజూరు..

హర్షం వ్యక్తం చేసిన యాదవ సంఘ సభ్యులు.. 

ముస్తాబాద్ (విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా(Rajanna Sircilla District)లో ముస్తాబాద్ మండలం గూడూర్ గ్రామంలో యాదవ సంఘ భవనానికి సంఘం సభ్యులు భూమి పూజ నిర్వహించారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్ సహకారంతో రాజ్యసభ సభ్యుడు సురేష్ రెడ్డి ఐదు లక్షల రూపాయలు యాదవ సంఘానికి మంజూరు చేసినట్లు సంఘ నాయకులు తెలిపారు. సంఘ భవనానికి నిధులు మంజూరు చేసిన రాజ్యసభ సభ్యుడు సురేష్ రెడ్డికి, సహకరించిన వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు సంఘ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గూడూరు మండల బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు మాజీ సర్పంచ్ చీటి వెంకటనర్సింగ రావు,పార్టీ గ్రామశాఖ అధ్యక్షుడు తాటాకర్ల ప్రభాకర్. కేటీఆర్ సేన ముస్తాబాద్ మండల అధ్యక్షుడు వంగూరి దిలీప్, గ్రామ మాజీ ఉపసర్పంచ్  మందాటి పద్మ నాంపల్లి, యాదవ సంఘం అధ్యక్షుడు  జాంపెల్లి వెంకటేష్, ఉపాధ్యక్షుడు దేవేందర్, కోశాధికారి మహేందర్, యాదవ సంఘ నాయకులు,యూత్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.