26-07-2025 06:38:06 PM
వలిగొండ (విజయక్రాంతి): దివిస్ వాటర్ సంపులో పడి ఒకరి మృతి చెందిన సంఘటన వలిగొండ మండలం(Valigonda Mandal)లోని జాలు కాలువ గ్రామం పరిధిలో చోటుచేసుకుంది. స్థానిక ఎస్ ఐ యుగంధర్ గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం... వలిగొండ మండలంలోని జాలుకాలువ గ్రామ పరిధిలో గల దివిస్ వాటర్ ప్లాంట్ లో కాంట్రాక్టు లేబర్ గా పనిచేస్తున్న కనికంటి వీరేంద్ర చారి అతనితో పాటు ఇతరులు వాటర్ సంప్ లోని మోటార్ పంప్ సెట్ కు మరమ్మతులు చేయడం జరిగిందని భోజన సమయం కావడంతో ఇతరులు వెళ్ళగా వెనకాల వస్తున్న వీరేంద్ర చారి ప్రమాదవశాత్తు కాలుజారి నీటి సంపులో పడి మృతి చెందాడని తెలిపారు. మృతుడు తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.