calender_icon.png 27 July, 2025 | 5:08 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గ్రంథాలయాలను వినియోగించి అభ్యసన సామర్థ్యాలను పెంచాలి

26-07-2025 06:42:58 PM

నాగరాజు శేఖర్..

భద్రాద్రి కొత్తగూడెం (విజయక్రాంతి): పాఠశాలల్లో ఉన్న గ్రంథాలయాలను సమర్థవంతంగా వినియోగించడం ద్వారా పిల్లల్లో ఆశించిన అభ్యసన సామర్ధ్యాలు పెంపొందించవచ్చని జిల్లా విద్యాశాఖ అకాడమిక్ మానిటరింగ్(District Education Department Academic Monitoring) అధికారి ఏ. నాగరాజు శేఖర్ అన్నారు. శనివారం కొత్తగూడెంలోని జిల్లా విద్యా శిక్షణా కేంద్రంలో కాంప్లెక్స్ స్థాయి రిసోర్స్ పర్సన్ లకు పాఠశాలల్లో గ్రంథాలయాల నిర్వహణ, సమర్థవంతమైన వినియోగం అనే అంశంపై ఒకరోజు శిక్షణ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, పిల్లలలో చదువు పట్ల ఆసక్తిని పెంచడానికి గ్రంధాలయాలు అతి ముఖ్యమైన వనరని, వీటిని సమర్థవంతంగా వినియోగిస్తే బహుళ తరగతి బోధన సులభవంతమవుతుందన్నారు.

పాఠశాలల్లో పాఠ్యపుస్తకాలు, వర్క్ బుక్స్, వినియోగంతో పాటు గ్రంథాలయాలను సమర్థవంతంగా వినియోగిస్తే పిల్లలు చదివే అలవాటును పెంపొందించమని ఆశించిన అభ్యసన సామర్ధ్యాలు పెంపొందించుకుంటారని తెలిపారు. ఈ శిక్షణలో భాగంగా పాఠశాలల్లో గ్రంథాలయ నిర్వహణ, పిల్లలతో గ్రంథాలయ నిర్వహణ కమిటీని ఏర్పాటు చేయటం, గ్రంథాలయ పుస్తకాలను స్థాయి వారీగా వర్గీకరించడం, గ్రంథాలయ నిర్వహణలో పిల్లలు ఉపాధ్యాయులతోపాటు సమాజ భాగస్వామ్యాన్ని కూడా పెంపొందించడం వంటి అంశాలపై  వివరణాత్మక సూచనలను ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో రిసోర్స్ పర్సన్స్ గా ఎస్. రాజశేఖర్, వి. రవికుమార్ లు వ్యవహరించగా జిల్లాలోని 90 కాంప్లెక్స్ ల నుండి 180 మంది ఉపాధ్యాయులు పాల్గొన్నారు.