calender_icon.png 15 November, 2025 | 9:20 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాజీమార్గమే రాజమార్గం

15-11-2025 07:36:55 PM

జూనియర్ సివిల్ జడ్జి సాయికిరణ్ కాసమల్ల

లక్షెట్టిపేట,(విజయక్రాంతి): రాజీమార్గమే రాజమార్గం అని జూనియర్ సివిల్ జడ్జి సాయికిరణ్ కాసమల్ల అన్నారు. శనివారం స్థానిక న్యాయస్థానంలో జాతీయ ప్రత్యేక లోక్ అదాలత్ నిర్వహించారు. ఈ సందర్భంగా జూనియర్ సివిల్ జడ్జి సాయికిరణ్ కాస మల్ల మాట్లాడుతూ.... క్షణికావేశానికి లోనై చేసే అపరాధాలను రాజీపడడం ద్వారా ఇరుపక్షాల కక్షిదారులు తమ కేసులనుండి సివిల్ క్రిమినల్ కేసుల నుండి విముక్తి పొందొచ్చు రాజీమార్గమే రాజమార్గం అని ఆయన అన్నారు.

ఈరోజు లక్షెట్టిపేట కోర్టు లో 300 కి పైగా కేసులు రాజీ పడ్డాయని తెలియజేశారు ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గాండ్ల సత్యనారాయణ లోక్ అదాలత్ మెంబర్ కోమిరెడ్డి సత్తన్న, బార్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ ఎస్. ప్రదీప్ కుమార్, సీనియర్ న్యాయవాదులు రాజేశ్వర్ రావు, కారుకూరి సురేందర్, గడికొప్పుల కిరణ్ కుమార్ నగూరు రవీందర్,పద్మ, సత్యగౌడ్, శివశంకర్, తదితరులు పాల్గొన్నారు.