calender_icon.png 15 November, 2025 | 9:20 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రత్యేక లోక్ అదాలత్ ద్వారా 93 కేసులు పరిష్కారం

15-11-2025 07:33:33 PM

- లోక్ అధాలత్ ను వినియోగించుకున్న కక్షిదారులు

చిట్యాల,(విజయక్రాంతి): రామన్నపేట కోర్టు పరిధిలో ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ కోర్టు జడ్జి, అదనపు ఇంఛార్జి ఎస్.శిరీష కోర్టు హల్ లో ప్రత్యేక లోక్ అధాలత్ ను నిర్వహించగా శనివారం మొత్తం 93 కేసులకు పరిష్కారం లభించింది. రామన్నపేట జ్యుడిషియల్ కు సంబంధించి రామన్నపేట, వలిగొండ, మోత్కూరు, అడ్డగుడూరు స్టేషన్ పరిధిలో క్రిమినల్ కేసులు, ప్రీ లిటికేషన్, భూ వివాద కేసులు 77, ఇతర పిట్టి కేసులు 16 పరిష్కరించుకున్నారు.

అనంతరం జడ్జీ మాట్లాడుతూ క్షణిక ఆవేశాలతో అప్పటి పరిస్థితులలో కేసులు పెట్టుకుని కోర్టుల చుట్టూ తిరుగుతూ డబ్బులు, సమయం వృధా చేసుకోవడం బదులు రాజీ మార్గమే రాజమార్గంగా కోర్టు పరిధిలో నిర్వహించే లోక్ ఆధాలత్ వినియోగించుకొని సమస్యలు పరిష్కరించుకోవడానికి కక్షిదారులు ముందుకు రావాలని తెలిపారు. కోర్టు ప్రాంగణంలో లీగల్ సర్వీసెస్ టీమ్ సభ్యులు బత్తుల గణేష్, కానుగంటి శ్రీశైలం లు కలిసి పోలీస్ సిబ్బంది సమక్షంలో వివిధ రకాల కేసులు నిమిత్తం కోర్టుకి  వచ్చిన వారికి లీగల్ సర్వీసెస్ ద్వారా కేసులు పరిష్కరించుకునే మార్గాలు, సూచనలు అందజేశారు. అనంతం వారికి లోక్ అదాలత్, లీగల్ సర్వీసెస్ కి సంబందించిన బ్రోచర్ లు పంపిణి చేశారు.