15-11-2025 07:31:25 PM
కామారెడ్డి (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా కేంద్రంలోని పలు దుకాణాలను ఆహార భద్రత శాఖ అధికారులు శనివారం తనిఖీలు నిర్వహించారు. ఆహార భద్రత నియోజక అధికారిని శిరీష, ఆహార భద్రతాధికారి విక్రమ్ తో కలిసి పలు దుకాణాల్లో తనిఖీలు నిర్వహించారు. ఆహారానికి సంబంధించిన వస్తువుల నిలువలు, ప్యాకింగ్ లను పరిశీలించారు. సంబంధిత దుకాణదారులు తనిఖీల్లో కొన్ని ఉల్లంఘనాల కు పాల్పడినట్లు అధికారులు గుర్తించారు. సంబంధిత దుకాణదారులకు మెరుగుదల కోసం నోటీసులు జారీ చేశారు. అదనంగా లేబుల్ నిబంధనలో తప్పనిసరిగా పాటించాలని ఆహార వ్యాపార నిర్వాహకులను అధికారులు హెచ్చరించారు. ఆహార భద్రత ప్రమాణాలను పాటించాలని వారు వ్యాపారస్తులను కోరారు.