15-11-2025 07:32:40 PM
ముకరంపుర (విజయక్రాంతి): నగరంలోని హనుమాన్ నగర్ బ్లూబెల్స్ ఇన్నోవేటివ్ స్కూల్ లో శనివారం స్వయం పరిపాలన దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కరస్పాండెంట్ జంగ సునీత మనోహర్ రెడ్డి జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకను ప్రారంభించారు. 10వ తరగతి విద్యార్థులు ఒక్కరోజు ఉపాధ్యాయులుగా వ్యవహరించి తరగతులకు బోధించారు. పాఠశాల ప్రిన్సిపాల్ జంగ సునీత మనోహర్ రెడ్డి మాట్లాడుతూ పిల్లల సృజనాత్మకత, నాయకత్వ లక్షణాల అభివృద్ధికి పర్యటనలు, అనుభవాత్మక కార్యక్రమాలు కీలకమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు.