calender_icon.png 26 November, 2025 | 4:06 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వడ్డీ లేని రుణాలతో ఆర్థికంగా ఎదగాలి

26-11-2025 12:00:00 AM

మహిళా సంఘాల సభ్యులకు ఎమ్మెల్యే పాయల్ సూచన

ఆదిలాబాద్, నవంబర్ 25, (విజయక్రాంతి) : ప్రభుత్వం అందించే వడ్డీలేని రుణాలను మహిళలు సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా అభివృద్ధి చెందాలని ఎమ్మెల్యే పాయల్ శంకర్ సూచించారు. మంగళవారం ఆదిలాబాద్ రూరల్ ఎంపీడీఓ కార్యాలయంలో నిర్వహించిన స్వయం సహాయక సంఘాల (ఎస్‌హెచ్‌సీ) మహిళలకు వడ్డీలేని రుణాల పంపిణీ కార్యక్ర మంలో అదనపు కలెక్టర్లు శ్యామలాదేవి, రాజేశ్వర్లతో కలిసి ఆయన పాల్గొన్నారు.

ఈ సందర్భంగా అధికారులు కలిసి 3.03 కోట్ల విలువైన వడ్డీ లేని రుణాల చెక్కులను మహిళా సంఘాలకు ఎమ్మెల్యే అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.... మహిళలను వ్యా పారాల వైపు దారితీసి కోటీశ్వరులను చేయాలనే సంకల్పంతో ప్రభుత్వం వడ్డీ లేని రుణాలు అందిస్తున్నదని తెలిపారు. జిల్లాకు కేటాయించిన 3.03 కోట్లు విలువైన రుణాలకు ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపారు.

రుణాలను వ్యక్తిగత అవసరాల కోసం కాకుండా వ్యాపారం కోసం వినియోగించాలని సంఘాలకు సూచించారు. మహిళలు ప్రతి రంగంలో రాణించాలని, పొదుపు అలవాటు పెంపొందించుకోవాలని సూచించారు. ఈ కార్య క్రమంలో డిఆర్డీఓ రవీందర్, ఎంపీడీవో వంశీ కృష్ణ, మహిళా సంఘాల సభ్యులు తదితరులు పాల్గొన్నారు.