24-09-2025 12:16:07 AM
మహబూబాబాద్ సెప్టెంబర్ 23 (విజయక్రాంతి): జీఎస్టీ పేరుతో పన్నుల భారం మోపింది భారతీయ జనతా పార్టీ సర్కారే నని, ఇప్పుడు తగ్గించి సంబరాలు చేయడం ఏమిటని, ఇంతకాలం ప్రజలకు పనుల భారంతో నడ్డి విరిచిన కేంద్ర సర్కార్ తీరు విడ్డూరంగా మారిందని సిపిఐ మహబూబాబాద్ మున్సిపల్ మాజీ ఫ్లోర్ లీడర్ అజయ్ సారధి రెడ్డి ఆరోపించారు. దేశ ప్రజల కష్టాన్ని ఇంతకాలం జీఎస్టీ ల పేరుతో వసూలు చేసి ప్రైవేటు కార్పొరేటు సంస్థలకు దోచిపెట్టి ఇప్పుడు తగ్గించామని చెప్పడం సిగ్గుచేటు అన్నారు.
రైతులకు అవసరమైన యూరియాను సరఫరా చేయకుండా కోటా పేరుతో ఇబ్బందులు పెట్టి, రైతుల కష్టానికి కేంద్రం కారణమైందని విమర్శించారు. మానుకోట మున్సిపాలిటీలో పారిశుధ్య సమస్య తీవ్రంగా మారిందని అధికారులు వెంటనే స్పందించి సమస్య పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో ఆ పార్టీ నాయకులు పెరుగు కుమార్, చింతకుంట్ల వెంకన్న, స్వామి, రవి, మహమూద్ ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.