24-09-2025 12:14:40 AM
నర్సంపేట/ నల్లబెల్లి సెప్టెంబర్ 23 (విజయక్రాంతి): నల్లబెల్లి మండలం నందిగామ గ్రామానికి చెందిన కంచ చంద్రశేఖర్ (23) ఉరి వేసుకొని బలవన్మరణానికి పాల్పడిన ఘటన సోమవారం చోటు చేసుకుంది. పోలీసులు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం సోమవారం మధ్యాహ్నం నర్సంపేట మండలం దాసరిపల్లి గ్రామం మృతుడి అమ్మమ్మ ఇంటి కి వెళ్ళి మధ్యాహ్నం ఇంట్లో ఎవరు లేని సమయంలో ఫ్యాన్ కి ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
పనులు ముగించుకుని అమ్మమ్మ వాళ్ళ కుటుంబ సభ్యులు చూడగా ఫ్యాన్ కి ఉరివేసుకొని చనిపోయాడు అని తెలిపారు.సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలించారు. ఆత్మహత్య చేసుకోవడానికి కారణాలు తెలియాల్సి ఉంది. మృతుడి తండ్రి కంచరవి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని నర్సంపేట ఎస్త్స్ర గూడ అరుణ్ తెలిపారు.