calender_icon.png 19 October, 2025 | 2:29 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గుజరాత్ మంత్రివర్గం రాజీనామా

17-10-2025 12:46:07 AM

నేడు నూతన క్యాబినెట్!

న్యూఢిల్లీ, అక్టోబర్ 16 : గుజరాత్ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ మినహా మంత్రులంతా గురువారం రాజీనామా చేశారు. మంత్రివర్గం పునర్వ్య వస్థీకరణకు అనుకూలంగా వారు ఈ నిర్ణయం తీసుకున్నారు. శుక్రవారం మధ్యా హ్నం నూతన క్యాబినెట్ కొలువుదీరనున్నట్టు సమాచారం. ఈ మేరకు సీఎం భూపేంద్రపటేల్ నివాసంలో నేతలంతా భేటీ అయ్యారు. ఈ సమావేశానికి బీజేపీ జాతీయ ప్రధానకార్యదర్శి సునీల్ బన్సల్ హాజరయ్యారు.

భూ పేంద్రపటేల్, సునీల్ వన్సల్ ప్రతి మంత్రిని విడివిడిగా కలిశారు. రాజీనామా అడిగే ముందు అగ్రనాయకత్వం నిర్ణయాన్ని చెప్పారని, అనంతరం ఆ రాజీనామాలను సీఎం ఆమోదించారని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. గుజరాత్ అసెంబ్లీ సభ్యుల సంఖ్య 182. నిబంధన ప్రకారం.. 27 మంది వరకు  లేదా అసెంబ్లీ సభ్యుల సంఖ్యాబలంలో 15 శాతం మంత్రులను చేసుకునే వీలుంటుంది.