27-01-2025 11:35:33 PM
హల్దానీ (ఉత్తరాఖండ్): 38వ జాతీయ అథ్లెటిక్స్ గేమ్స్‌లో మహారాష్ట్ర జట్టు ట్రయథ్లాన్ మిక్స్‌డ్ రిలే ఈవెంట్‌లో స్వర్ణం నెగ్గింది. సచిన్ మిరాజె, డోలీ దేవిదాస్, కౌషిక్, మాన్సి వినోద్‌లతో కూడిన మహారాష్ట్ర బృందం గమ్యాన్ని (2:12:06) పూర్తి చేసి పసిడి దక్కించుకోగా.. అంకుర్, దుర్వీశా, రోషన్, ఆధ్యలతో కూడిన మధ్యప్రదేశ్ జట్టు (2:12: 41 ) రెండోస్థానంలో.. ఆకాశ్, కీర్తి, సాయి లోహితాక్ష్, ఆర్తితో కూడిన తమిళనాడు (2:14:08) మూడో స్థానంలో నిలిచి రజత, కాంస్య పతకాలు సాధించాయి. వ్యక్తిగత ట్రయథ్లాన్ ఈవెంట్‌లో మహారాష్ట్రకు చెందిన మిరాజె, డాలీ స్వర్ణాలు గెలవగా.. మాన్సి మోహితే రజతం నెగ్గింది. మధ్యప్రదేశ్‌కు చెందిన ఆధ్య సింగ్ కాంస్యం సాధించింది.