11-09-2025 01:28:16 AM
సత్యసాయి సేవా సమితికి ఎమ్మెల్యే జీఎంఆర్ సాయం
పటాన్చెరు, సెప్టెంబర్ 10(విజయ క్రాంతి):శ్రీ సత్య సాయిబాబా సేవాసమితి ఆధ్వర్యంలో సమాజ అభివృద్ధికి చేపడుతున్న సేవా కార్యక్రమాలు అభినందనీ యమని, నవంబర్లో జరగనున్న సత్య సా యిబాబా గురుపూర్ణిమ ముగింపు ఉత్సవాలను పురస్కరించుకొని నియోజకవర్గం నుండి మూడువేల మంది భక్తులు తరలి వెళ్తున్నారని..
ఇందుకోసం గతంలో ఇచ్చిన హామీ మేరకు ఐదు లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందించినట్లు పటాన్చెరువు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు.బుధవారం పటాన్చెరు పట్టణంలోని శాంతినగర్ కాలనీలో గల సత్య సాయి బాబా మందిరంలో గురు పూర్ణిమ పురస్కరించుకొని వంద రోజులపాటు నిర్వహిస్తున్న కార్యక్రమాలలో భాగంగా నిర్వహించిన ప్రత్యేక పూజ కార్యక్రమాలలో ఆయన పాల్గొన్నారు.
రాబోయే రోజుల్లో సత్య సాయి బాబా మందిరాల నిర్మాణాలకు భూమిని సైతం కేటాయిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో అమీన్పూర్ మాజీ జెడ్పిటిసి సుధాకర్ రెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయ్ కుమార్, సత్యసాయి బాబా సేవాసమితి బాధ్యులు రామి రెడ్డి, వెంకటేష్, శంకర్ పాల్గొన్నారు.