calender_icon.png 12 July, 2025 | 6:53 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఘనంగా గురు పౌర్ణమి వేడుకలు

11-07-2025 12:31:52 AM

- పాల్గొన్న ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి

ఇబ్రహీంపట్నం, జూలై 10: గురుపౌర్ణమి వేడుకలు నియోజకవర్గ వ్యాప్తంగా ఘనంగా జరిగాయి. గురుపౌర్ణమి సందర్భంగా గురువారం ఆదిబట్ల మున్సిపాలిటీ పరిధి కొంగరకలాన్ లోని శ్రీ సాయిబాబ మందిరంలో నిర్వహించిన ప్రత్యేక పూజ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్య క్రమంలో గడ్డి అన్నారం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ చిలుక మధుసూదన్ రెడ్డి, ఆదిభట్ల మున్సిపల్ మాజీ చైర్మన్ మర్రి నిరంజన్ రెడ్డి, కాంగ్రేస్ నాయకులు కొత్తకురుమ శివ కుమార్, సైదయ్య, నీళ్ళ మహేష్ గౌడ్, రమేష్, భాను, భూపాల్ రెడ్డి,తదితరులుపాల్గొన్నారు.