calender_icon.png 11 July, 2025 | 11:04 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పనిచేస్తున్న షాపులో చోరీలు వర్కర్ల అరెస్టు

11-07-2025 12:31:57 AM

నిర్మల్, జూలై 10(విజయక్రాంతి): జిల్లా కేంద్రంలో మోహన్ ఎలక్ట్రానిక్ షోరూంలో విధులు నిర్వహిస్తున్న నలుగురు వర్కర్లు రాత్రి వేళల్లో ఎలక్ట్రానిక్ సామాగ్రిని దొంగిలించిన కేసులో గురువారం అరెస్టు చేసిన ట్టు రూలర్ సీఐ కృష్ణ తెలిపారు. స్థానిక పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్సై సంజీవ కలిసి వివరాలు వెల్లడించారు.

మోహన్ ఎలక్ట్రానిక్ షో రూమ్ లో కొన్ని రోజులుగా ఎలక్ట్రానిక్ వస్తువులు మాయం కావడంతో యజమాని వెంకటరమణ షాపులో పనిచేస్తున్న నలుగురిపై అను మానం వ్యక్తం చేసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. షాపులో పనిచేస్తున్న శ్రీకాంత్ జవా న్ జగదీశ్వర్ నవీన్ అనే నలుగురు వ్యక్తులు యాజమాని లేనప్పుడు కస్టమర్ డెలివరీ పేరుతో ఫ్రిడ్జ్ కూలర్లు గ్రీజర్లు టీవీలను బయటకు తరలించే వారిని విచారణలో తేలింది అన్నారు.

దీనికి ఆటో డ్రైవర్ నయా న్ ఇస్మాయిల్ సహకరించడంతో నిఘా వేసిన పోలీసులు గురువారం వస్తువులను తరలిస్తుండగా పట్టుకుని అరెస్టు చేయడం జరిగిందని తెలిపారు. ఉపాధి కల్పిస్తున్న యాజమానికి అందులో పనిచేసే కార్మికులు మోసం చేయడంతో చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు