calender_icon.png 26 November, 2025 | 4:07 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గురు తేగ్ బహదూర్ దేశానికే మార్గదర్శి

26-11-2025 12:42:00 AM

-మా పార్టీ ఓటు బ్యాంక్ రాజకీయాలు చేయదు

-బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు

హైదరాబాద్, నవంబర్ 25 (విజయక్రాంతి): గురు తేగ్ బహదూర్ బలిదానాన్ని దేశమంతా గుర్తించాలని, భారత్‌కు ఆయన మార్గదర్శి అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రాంచందర్‌రావు పేర్కొన్నారు. బీజేపీ ఓటు బ్యాంకు రాజకీయాలు చేయదని, గురు తేగ్ చేసిన త్యాగాన్ని గుర్తించి జయంతి, వర్ధంతులు నిర్వహిస్తున్నామని తెలిపారు. మంగళ వారం గురు తేగ్ బహదూర్ 350వ వర్ధంతి సందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మైనార్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు జగన్‌మోహన్‌సింగ్ ఆధ్వర్యంలో బలిదాన్ దివాస్ నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రాంచందర్‌రావు హాజరై మాట్లాడా రు. దేశం కోసం తన ప్రాణాలను అర్పించిన గురు తేగ్ బహదూర్ త్యాగం, ధర్మ పరిరక్షణ కోసం చేసిన పోరాటం భారత చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందని పేర్కొన్నారు. దయాల్ సింగ్, మతి సింగ్, సతి సింగ్.. ఈ ముగ్గురూ అదే రోజున గురు తేగ్ బహదూర్ సింగ్‌తోపాటు బలిదానం చేసిన మహనీయులని కొనియాడారు.

వారి త్యాగాలను సిక్కు సమాజం మాత్రమే కాదు, దేశమంతా స్మరించాలి, గౌరవించాలని తెలిపారు. ఆ కాలంలో ఔరంగజేబ్ జారీ చేసిన శాసనం ప్రకారం ప్రజలను బలవంతంగా మత మార్పిడి చేసే ప్రయత్నాలు జరిగాయన్నారు. ఆ మత మార్పిడికి వ్యతిరేకంగా, ధర్మాన్ని రక్షించడానికి సిక్కులు చేసిన ఆ మహాత్యాగాలను మనం నేటికీ గుర్తుంచుకోవాలని తెలిపారు.