23-08-2025 12:14:40 AM
సిద్దిపేట, ఆగస్టు 22: నిత్య విద్యార్థులుగా ఉండేవారు జీవితంలో కీర్తి ప్రతిష్టలు పొందుతారని సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సునీత అన్నారు. సిద్దిపేట గురుకుల డిగ్రీ కళాశాలలో ప్రొఫెసర్లుగా పనిచేస్తున్న డాక్టర్ జి. ఆర్. రమాదేవి, డాక్టర్ సిహెచ్ పుష్పలత లు వివిధ అంశాలలో పరిశోధనలు చేసి డాక్టరేట్ సాధించిన సందర్భంగా శుక్రవారం కళాశాలలో ఏర్పాటుచేసిన సమావేశంలో వారిద్దరిని సన్మానించి అభినందించారు.
కంప్యూటర్ సైన్స్ లో ట్రస్ట్ బెసుడు డ్యూయల్ అతంటికేషన్ స్కీం ఫర్ సెక్యూర్ రౌటింగ్ ఇన్ మానెట్స్ అనే అంశంలో డాక్టర్ జి.ఆర్. రమాదేవి, గణిత శాస్త్రంలో న్యూమరికల్ స్టడీ ఆఫ్ ఎం హెచ్ డి డార్సి ఫోర్చ్మర్ ఫ్లో ఆఫ్ నాన్ న్యూటనియన్ నానో ఫ్లూయిడ్స్ అనే అంశంలో డాక్టర్ సిహెచ్ పుస్పలత పరిశోధనలు పూర్తి చేసి రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ చేతుల మీదుగా డాక్టర్ పట్టా అందుకున్నారు. కళాశాలలో అనుభవం కలిగిన, పరిశోధనలు చేసిన ప్రొఫెసర్లు ఉండటం వల్ల విద్యార్థులకు మెరుగైన విద్య అందుతుందని ప్రిన్సిపాల్ తెలిపారు.