calender_icon.png 23 August, 2025 | 3:07 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీసీల రిజర్వేషన్లను అడ్డుకుంటున్న నరేంద్ర మోదీ

23-08-2025 12:14:19 AM

బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నరేందర్ గౌడ్ 

నిజామాబాద్ ఆగస్టు 22 (విజయ క్రాంతి): బీసీ రిజర్వేషన్లు అమలు కాకుండా అడుగున కేంద్ర ప్రభుత్వం అడ్డుకుంటుందని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు మేకపోతుల నరేందర్ గౌడ్ ఆరోపించారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని న్యూ అంబేద్కర్ భవన్లో శుక్రవారం ఏర్పాటు చేసిన బీసీ సంక్షేమ సంఘం జిల్లా సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీసీల బద్ధ శత్రువు నరేంద్ర మోడీ అని ఆరోపించారు. 

రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితేనే బీసీలకు మనుగడ సాధిస్తారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. బీసీ సామాజిక సేవలో బీసీల పక్షాన ఎవరున్నా వారికి వచ్చే ఎన్నికల్లో భవిష్యత్తులో బీసీల సంపూర్ణ మద్దతు ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. పార్లమెంట్ సభలలో బీసీల పక్షాన పోరాడు ఉన్నది రాహుల్ గాంధీ ఒక్కరేనని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు.

తాను ఏ పార్టీకి సంబంధించిన వాడిని కాదని కేవలం బీసీ సామాజిక న్యాయం కోసం పోరాటం చేస్తున్నానని నరేందర్ గౌడ్ వెల్లడించారు భవిష్యత్తులో బీసీలు బాగుపడితేనే దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తుందని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు బీసీలకు విద్యా ఉద్యోగ స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్ల బిల్లు సాధించుకోవడానికి బీసీలు అంత సంఘటితం కావాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే ఆకుల లలిత రాష్ట్ర ఉపాధ్యక్షులు బొబ్బిలి నరసయ్య జిల్లా అధ్యక్షుడు నారా గౌడ్ ప్రధాన కార్యదర్శి కరిప గణేష్ బీసీ సంక్షేమ సంఘం ఫోరమ్ చైర్మన్ ఓయూ విద్యార్థి జేఏసీ చైర్మన్ ప్రవీణ్ కుమార్ యువజన అధ్యక్షులు రాజా గౌడ్ తంబాకు చంద్రకళ బంటు బలరాం నరసింహులు గౌడ్ తదితరులు పాల్గొన్నారు.