23-08-2025 12:15:52 AM
పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్ల పర్యవేక్షణ
నిజామాబాద్ ఆగస్టు 22; (విజయ క్రాంతి): నిజామాబాద్ జిల్లా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టును నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య, సందర్శించారు. ఈ సందర్భంగా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ వివరాలు ఇరిగేషన్ అధికారులను అడిగి ఆయన తెలుసుకున్నారు. గోదావరి పరివాహక ప్రజలను అప్రమత్తం చేయి సంబంధిత సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు.
ఎస్సారెస్పీ ప్రాజెక్టు దిగువన గోదావరి నది పరిసర ప్రాంతాలలోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అలాగే పశువుల కాపర్లు, గొర్ల కాపరులు, చేపలు పట్టేవారు, రైతులు సామాన్య జనం గోదావరి నదిని దాటే ప్రయత్నాలు చేయవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. అత్యవసర సమయంలో సంబంధిత పోలీస్ స్టేషన్ వారిని లేదా డయల్ 100 లేదా పోలీస్ కంట్రోల్ రూమ్ 8712659700 సంప్రదించాలని సి పి సాయి చైతన్య ప్రజలకు తెలిపారు.
ప్రాజెక్టు నీటిని విడుదల చేయడానికి జల కల సంతరించుకున్నప్రాజెక్టు పర్యటకుల సందడి ఎక్కువ అవుతున్న సందర్భంగా పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లను చేయాలని స్థానిక పోలీస్ సిబ్బందిని ఆయన ఆదేశించారు. పర్యాటకుల వాహనాల పార్కింగ్ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. సాయి చైతన్య తో పాటు ఆర్మూర్ ఏసిపి శ్రీ వై. వెంకటేశ్వర రెడ్డి , ఆర్మూర్ రూరల్ సీఐ శ్రీధర్ రెడ్డి , మెండోరా ఎస్త్స్ర జె. సుహాసిని తదితరులు ప్రాజెక్టు సందర్శించిన వారిలో ఉన్నారు