06-05-2025 12:00:00 AM
మంచిర్యాల, మే 5 (విజయక్రాంతి): తెలంగాణ సైకాలజిస్ట్స్ అసోసియేషన్ (టీపీఏ) 8వ వార్షికోత్సవ వేడుకలు సోమవారం జిల్లా శాఖ ఆధ్వర్యంలో విన్నర్స్ అకాడమీలో ఘనంగా నిర్వహించారు. సైకాలజి స్ట్‌లు పాల్గొని కేక్ కట్ చేసి ఘనంగా జరిపా రు. ఈ సందర్భంగా టీపీఏ జిల్లా అధ్యక్షులు, సైకాలజిస్ట్ రంగు వేణుకుమార్ మాట్లాడుతూ.. తెలంగాణ వ్యాప్తంగా ఎనిమిదేళ్లుగా మానసిక రుగ్మతలను నిర్మూలించేందుకు ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తూ ముందుకు సాగుతున్నామన్నారు.
సమాజంలో ఒక నైతికతను పెంపొందించడంతోపాటు, విద్యార్థు లు, యువత మానసిక ఒత్తిడిని అధిగమించడంతోపాటు వ్యక్తిత్వ వికాసాన్ని అలవర్చు కొని మంచి పౌరులుగా నిర్మితమవుతారన్నా రు. కార్యక్రమంలో మంచిర్యాల జిల్లా గౌరవ సలహాదారులు కేటిఎస్ స్కూల్ చైర్మన్ పద్మచరణ్, యోగేశ్వర్, ప్రధాన కార్యదర్శి సుమన చైతన్య, వైస్ ప్రెసిడెంట్స్ మొగిలి, రజిత, విన్నర్స్ అకాడమీ డైరెక్టర్ నాగరాజు తదితరులు పాల్గొన్నారు.