calender_icon.png 5 November, 2025 | 3:52 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హస్తం గుర్తు.. పతంగి పార్టీ మనిషి

05-11-2025 01:30:03 AM

-మజ్లిస్ పార్టీ అభ్యర్థినే కాంగ్రెస్ అద్దెకు తెచ్చుకుంది

-జూబ్లీహిల్స్ ప్రచారంలో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి 

హైదరాబాద్ సిటీ బ్యూరో, నవంబర్ 4 (విజయక్రాంతి): జూబ్లీహిల్స్ ఎన్నికలో హ స్తం గుర్తుతో పతంగి పార్టీ మనిషి పోటీ చేస్తున్నాడని, మజ్లిస్ పార్టీ అభ్యర్థినే కాం గ్రెస్ అద్దెకు తెచ్చుకున్నదని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఎద్దేవా చేశారు. జూబ్లీహిల్స్‌లో బీజేపీ అభ్య ర్థి లంకల దీపక్‌రెడ్డికి మద్దతుగా కేంద్ర మం త్రి కిషన్‌రెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం భా రీ బైక్ ర్యాలీ నిర్వహించారు. కృష్ణకాంత్ పా ర్కు వద్ద జరిగిన సభలో కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. “నవంబర్ 11న జరిగే ఈ ఎన్నికలు హైదరాబాద్ భవిష్యత్తును నిర్ణయించబోతున్నాయి.

జూబ్లీహి ల్స్‌లో హస్తం పార్టీ వెనుక పతంగి పార్టీ ఉంది. మజ్లిస్ పార్టీ అభ్యర్థినే కాంగ్రెస్ పార్టీ అద్దెకు తెచ్చుకుంది. 2014లో మజ్లిస్ తరఫున పోటీ చేసిన వ్యక్తినే రేవంత్‌రెడ్డి ఈరోజు కాంగ్రెస్ అభ్యర్థిగా నిలబెట్టారు. గ్రేటర్ హైదరాబాద్ మేయర్ సీటును మజ్లిస్‌కు కట్టబెట్టాలనే ఒప్పందంతోనే ఈ దోస్తానా నడు స్తోంది” అని సంచలన ఆరోపణలు చేశారు. “పదేళ్లుగా బీఆర్‌ఎస్ పార్టీ మ జ్లిస్ అడుగులకు మడుగులొత్తింది. ఇప్పుడు కాంగ్రెస్ అదే బాటలో నడుస్తోంది” అని విమర్శించారు.

300 మందికి పైగా హిందువులను హత్య చేసిన చరిత్ర మజ్లిస్ పార్టీదని, ఆ పార్టీతోనే కాంగ్రెస్, బీఆర్‌ఎస్ చేతులు కలిపాయని విమర్శించారు. కాంగ్రెస్ ఇచ్చినవి గ్యారంటీలు కావు, అవి 420 సబ్‌గ్యారంటీలని ఎద్దేవా చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ లు నెరవేర్చకుండా ఏ ముఖం పెట్టుకుని మ ళ్లీ ఓట్లు అడుగుతున్నారని ప్రశ్నించారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్, మజ్లిస్ మూడు కుటుం బ పార్టీలు తెలంగాణకు పట్టిన శని అని తీ వ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

జూబ్లీహిల్స్‌లో 10 ఏళ్లు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే ఉన్నా ఎలాం టి అభివృద్ధి జరిగిందని ప్రశ్నించారు. రోడ్లు గుంతలమయంగా, డ్రైనేజీలు పొంగిపొర్లు తూ ఉన్నాయన్నారు. హైదరాబాద్‌ను సింగపూర్ చేస్తామని చెప్పి, చెత్తకూపంగా మా ర్చారని మండిప్డారు. ఈ దుస్థితి మారాలం టే, అవినీతికి ఆస్కారం లేని పారదర్శక పా లన అందించే బీజేపీ అధికారంలోకి రావాలని, జూబ్లీహిల్స్‌లో ప్రజల కోసం పనిచేసే దీపక్‌రెడ్డిని గెలిపించాలని కిషన్‌రెడ్డి కోరారు.