calender_icon.png 3 August, 2025 | 9:22 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

త్వరలో అందుబాటులోకి అర్బన్ పార్క్ కాటేజీలు

02-08-2025 12:09:15 AM

కలెక్టర్ రాహుల్ రాజ్

నర్సాపూర్/వెల్దుర్తి, ఆగస్టు 1: నర్సాపూర్ అర్బన్ ఫారెస్ట్ పార్క్ కాటేజీలు ఈ నెలాఖరు వరకు యాత్రికులకు అందుబాటులోకి తీసుకురావడానికి ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు.

శుక్రవారం నర్సాపూర్ పర్యటనలో భాగంగా నర్సాపూర్ అర్బన్ ఫారెస్ట్ పార్కును సందర్శించి నిర్మాణాలు పూర్తి చేసుకుని చివరి దశలో ఉన్న కాటేజీ పనులను సంబంధిత అటవీ శాఖ సిబ్బందితో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 

నర్సాపూర్ అర్బన్ ఫారెస్ట్ పార్క్ యాత్రికుల సౌకర్యార్థం సుమారు 42 కాటేజీలు నిర్మాణం చేపట్టడం జరిగిందని , ప్రస్తుతం 22 కాటేజీలు నిర్మాణాలను పూర్తి చేసుకుని ఈ నెలాఖరు వరకు ప్రారంభించనున్నట్లు తెలిపారు. మరింత సౌకర్యాలు యాత్రికులకు కల్పించాలని ఉద్దేశంతో కాటేజీ నిర్మాణాలు చేపట్టామని చెప్పారు. ఈ కార్యక్రమంలో అటవీ శాఖ అధికారులు పాల్గొన్నారు. 

  1. ప్రభుత్వ పథకాలకు రేషన్ కార్డులే ప్రామాణికం 
  2. ఎమ్మెల్యే సునీతారెడ్డి, కలెక్టర్ రాహుల్ రాజ్

అర్హులైన పేదలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించడంలో రేషన్ కార్డులు ప్రామాణికంగా నిలుస్తాయని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్, నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతారెడ్డి తెలిపారు. శుక్రవారం వెల్దుర్తి మండల కేంద్రంలో గల రైతు వేదికలో ఏర్పాటు చేసిన నూతన రేషన్ కార్డుల మంజూరు పత్రాల పంపిణీ కార్యక్రమంలో వారు పాల్గొన్నారు. వెల్దుర్తి మండలం 385 నూతన రేషన్ కార్డులు, 1489 కుటుంబ సభ్యుల పేర్లు నమోదు చేయడం జరిగిందన్నారు.

వెల్దుర్తి మండలంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న అనేక సంక్షేమ పథకాలు లబ్ధిదారులకు చేరడంలో రేషన్ కార్డులే ప్రామాణికంగా నిలుస్తాయని తెలిపారు. ప్రభుత్వం చేపట్టిన ప్రజా పాలన కార్యక్రమంలో అర్హులైన వారి నుండి రేషన్ కార్డుల కొరకు దరఖాస్తులు సేకరించి క్షేత్రస్థాయిలో విచారించి అర్హులైన పేదవారికి ప్రభుత్వం రేషన్ కార్డులు మంజూరు చేసిందని తెలిపారు.

సంక్షేమ పథకాలకు, విద్య, స్కాలర్షిప్లు, సీఎంఆర్‌ఎఫ్, ఆరోగ్యశ్రీ వంటి పథకాలకు ఇది ఉపయోగపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో జయచంద్రారెడ్డి, తహసిల్దార్,  ప్రజా ప్రతినిధులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.