calender_icon.png 31 October, 2025 | 3:13 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హనుమాన్ ఆలయ హుండీ లెక్కింపు

30-10-2025 12:47:04 AM

ఎల్బీనగర్, అక్టోబర్ 29 :  కర్మన్ ఘాట్ హనుమాన్ దేవస్థానం సంబంధించి 111 రోజుల ఆదాయాన్ని బుధవారం లెక్కించారు. ఆలయ హుండీలను దేవాదాయ శాఖ రంగారెడ్డి జిల్లా సహాయ కమిషనర్ చంద్రశేఖర్ పర్యవేక్షణలో ఆలయ కార్యనిర్వహణాధికారి లావణ్య ఆధ్వర్యంలో చైర్మన్ ఈదులకంటి సత్యనారాయణ రెడ్డి, ధర్మకర్తల సమక్షమంలో లెక్కింపు పూర్తి చేశారు. 111 రోజుల్లో భక్తులు వేసిన కానుకలు రూ.39,92,091/-, విదేశీ కరెన్సీ 63 యూఎస్ డాలర్లు, 30 యూకే పౌండ్స్, 35 యూఏఈ దిర్హాంస్, 10 సౌదీ రియాల్స్ వచ్చాయి.

హుండీ లెక్కింపునకు ముందుగా ఆలయంలో వచ్చే నెల 5వ తేదీన నిర్వహించే కార్తీక పౌర్ణమి మహోత్సవ అహ్వాన పత్రికను ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తలు దిండు ప్రవీణ్ గౌడ్, కొండ్ర సంతోష్ కుమార్, తోకటి కిరణ్ కుమార్, పూల నాగరాజు, కుకునూరి గోపాల్ రెడ్డి, కె.కవిత, సింగంశెట్టి శ్రీనివాస్, ఓరుగంటి నరేశ్, ఎక్స్ అఫీషియో సభ్యుడు అర్చక అంబా ప్రాసాద్, అర్చకులు, వివిధ వలంటరీ సంస్థల వలంటీర్లు, భక్తులు పాల్గొన్నారు.