calender_icon.png 26 November, 2025 | 7:19 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇందిరమ్మ ఇళ్లతో ప్రతి కుటుంబంలో ఆనందం

25-11-2025 12:00:00 AM

రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్

రాజన్న సిరిసిల్ల, నవంబర్ 24 (విజయక్రాంతి): ఇందిరమ్మ ఇళ్లతో ప్రతి కుటుంబంలో ఆనందం నెలకొంటుందని రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు..సోమవారం వేములవాడ పట్టణంలోని తిప్పాపూర్ లో సగ్గు లావణ్య శ్రీనివాస్ నూతన ఇందిరమ్మ ఇల్లు నిర్మాణం పూర్తి చేసుకొని సోమవారం గృహ ప్రవేశం చేసుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై గృహ ప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారులకు నూతన వస్త్రాలు అందజేసి వారి ఆనందంలో భాగస్వామ్యం అయ్యారు. ప్రజా ప్రభుత్వం ప్రజల కోసం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాల్లో ఇందిరమ్మ ఇళ్ల పథకం ఎంతో కీలకమైందని విప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. ప్రతి నిరుపేద కుటుంబం గౌరవప్రదమైన నివాసం కలిగి, సంతోషంగా జీవించాలన్నదే రాష్ట్ర ప్రభుత్వమన్న సంకల్పం అని అన్నారు.