calender_icon.png 26 November, 2025 | 6:51 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రూపాయికే గ్రాము ఆర్గానిక్ ఐస్‌క్రీమ్

25-11-2025 12:00:00 AM

ఎఎస్‌రావు నగర్‌లో ‘ఐస్‌బర్గ్ ఆర్గానిక్’ ఔట్‌లెట్‌ను ప్రారంభించిన నటుడు- తనికెళ్ల భరణి 

హైదరాబాద్ సిటీ బ్యూరో, నవంబర్ 24 (విజయక్రాంతి): కేవలం ఆదాయాన్ని చూడకుండా.. ప్రజల ఆరోగ్యంపై శ్రద్ధ చూపి ఐస్‌బర్గ్ ఆర్గానిక్‌ను అందుబాటులోకి తేవ డం సంతోషకరమని సీనియర్ నటుడు తనికెళ్ల భరణి కొనియాడారు. హైదరాబాద్ ఎఎస్‌రావు నగర్‌లో ఐస్‌బర్గ్ ఆర్గానిక్ కొత్త స్టోర్‌ను ఆయన ప్రారంభించారు. ఐస్ బర్గ్ ఆర్గానిక్ ఐస్ క్రీమ్స్ ఫౌండర్ సుహాస్ తదితరులు దీనికి హాజరయ్యారు. రెగ్యులర్ గా కాకుండా.. కాస్త భిన్నంగా ఉన్న ప్రొడకట్స్ కు మార్కెట్ లో డిమాండ్ ఉంటుందని తనికెళ్ళ భరణి చెప్పారు.

అలాంటి వాటిని ప్రజలు ఎక్కువగా ఆదరిస్తారని అభిప్రాయపడ్డారు. ఐస్ బర్గ్ మరింత అభివృద్ధి కావాలని.. మరిన్ని ఔట్ లెట్లు ప్రారంభించాలని ఆకాక్షించారు. హైదరాబాద్ లో రాబో యే 2, 3 నెలల్లో మరిన్ని స్టోర్లు మొదలు పెడతామని ఐస్ బర్గ్ ఆర్గానిక్ ఐస్ క్రీమ్స్ ఫౌండర్ సుహాస్ చెప్పారు. విజయవాడలో కూడా బ్రాంచ్ స్టార్ట్ చేస్తామని వెల్లడించారు.

సౌత్ ఇండియా మొత్తం విస్తరించే ప్రణాళికతో ఉన్నట్టు తెలిపారు. కస్టమర్ల ఆదరణ తమపై ఎప్పటికీ ఇలాగే ఉండాలని కోరారు. ఐస్బర్గ్ ఆర్గానిక్ ఐస్క్రీమ్స్ 2013 నుంచి ఆర్గానిక్ ఐస్ క్రీం ఇండస్ట్రీలో అగ్రగామిగా ఉంది. 2018లో ఈ బ్రాండ్ పూర్తిగా ఆర్గానిక్ విధానంలోకి మళ్లింది.