12-07-2025 01:39:39 AM
సదాశివపేట, జూలై 11 : సదాశివపేట పట్టణంలో శుక్రవారం నాడు ఆషాడమాసం సందర్భంగా అమ్మవారికి బోనాలతో మహిళలు ఊరేగింపుగా, పోతురాజు విన్యాసాలతో, శివసత్తుల పూనకాలతో, యువకులు భక్తి పాటల నృత్యాలతో డప్పు వాయిదాల మధ్యన అమ్మవారికి బోనాలు సమర్పించడం జరిగింది.
కుమ్మరివాడ నుండి మొదలైన బోనాలు గాంధీ చౌక్ మీదుగా దుర్గమ్మ మందిరము వరకు చేరుకొని అమ్మవారికి నైవేద్యాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో కుమ్మరి సంఘం అధ్యక్షులు దొడ్ల శివయ్య, సూరి, మల్లేశం, గణేష్, నారాయణ, లింగయ్య, వెంకట్, 16వ వార్డు కాంగ్రెస్ ఇంచార్జి గుజ్జరి శంకర్, కుమ్మరి సంఘం నాయకులు, పెద్దలు, యువకులు తదితరులుపాల్గొన్నారు.