calender_icon.png 19 May, 2025 | 10:33 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఘనంగా క్యాండిల్ లైట్ డే

19-05-2025 12:00:00 AM

కామారెడ్డి, మే 18 (విజయ క్రాంతి) : కామారెడ్డి జిజిహెచ్ ఆస్పత్రి ఆవరణలో ఆదివారం సాయంత్రం క్యాండిల్ లైట్ డే నిర్వహించారు. హెచ్‌ఐవి, ఎయిడ్స్ బారిన పడి చనిపోయిన బాధితుల స్మారకార్థం సందర్భంగా ప్రతి ఏటా ఈనెల మూడవ ఆదివారం క్యాండిల్ లైట్ డే  నిర్వహిస్తారు.

ఈ కార్యక్రమంలో భాగంగా ఆదివారం స్థానిక ఆసుపత్రి ఆవరణలో కొవ్వొత్తుల ను వెలిగించి ర్యాలీ నీ NHMPO  పద్మజా , ఏ ఆర్ టి మెడికల్ ఆఫీసర్ డా.స్నేహ , డాక్టర్ ప్రీతి కమల ఆధ్వర్యంలో నిర్వహించారు. ఆస్పత్రి నుంచి ఇందిరా గాంధీ చౌరస్తా వరకు ర్యాలీ కొనసాగించారు.

హెచ్‌ఐవి ఎయిడ్స్ బారిన పడి చనిపోయిన వ్యక్తుల ఆత్మకు శాంతి కలగాలని వారు రెండు నిమిషాలు మౌనం పాటించి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో  ఏఆర్ టి, ఐ సి టి సి కౌన్సిలర్లు మేక నాగరాజు, గోపాల్, మెహరాజ్, ప్రవీణ్, లలిత కుమారి , వర్డ్ ఆర్గనైజేషన్ ప్రతినిధులు రాణి, రమేష్, వై ఆర్ జీ కేర్ డిఆర్పి సుధాకర్, సేవా సంఘం పీ ఏం గోపాల్ , సిబ్బంది , ఐ ఎస్ ఆర్ డి ప్రతినిధి రాజేందర్,  వివిధ NGO ల   ఔట్రిచ్ వర్కర్లు పాల్గొన్నారు.