calender_icon.png 30 August, 2025 | 11:21 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png
Breaking News

మంథనిలో ఉప్పొంగిన గోదావరి

30-08-2025 04:40:54 PM

మంథని పట్టణ సమీపంలోకి గోదావరి నీళ్లు... భయాందోళనలో ప్రజలు

మంథని (విజయక్రాంతి): గోదావరి(Godavari) ఉప్పొంగుతుంది. గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాలకు కడెం ప్రాజెక్టు, ఎల్లంపల్లి ప్రాజెక్టు గేట్లు ఎత్తివేయడంతో గోదావరి ఇరువైపులా నిండుకుండలా ప్రవహిస్తుంది. దీంతో లోతట్టు ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. ఎల్లంపల్లి గేట్లు ఎత్తివేయడంతో మంథని ప్రాంతంలో గోదావరి నీరు మంథని పట్టణంలోని శ్రీ పాద కాలనీ సమీపంలోకి  మెల్లమెల్లగా చేరుకుంటుంది. మళ్లీ వాతావరణం కారు మబ్బులు కమ్ముకుంటుండడంతో అధికంగా వర్షాలు కురిస్తే గత మూడు సంవత్సరాల క్రితం గోదావరి నీరు చేరుకొని మంథని పట్టణం నీట మునగడంతో పట్టణ ప్రజలు తీవ్రంగా నష్టపోయారు. ఈ ఏడు కూడా గోదావరి మంథని సమీపంలోకి వస్తుండడంతో మంథని పట్టణ ప్రజలు మళ్ళీ భయాందోళన చెందుతున్నారు.