calender_icon.png 30 August, 2025 | 11:44 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కోటగుళ్ళు పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో మహా అన్నదానం

30-08-2025 04:39:05 PM

జయశంకర్ భూపాలపల్లి (విజయక్రాంతి): వినాయక చతుర్థి నవరాత్రి వేడుకల్లో భాగంగా శనివారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా(Jayashankar Bhupalpally District) గణపురం మండల కేంద్రంలోని కార్పెంటర్ కాలనీలో యువసేన ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణపతి మండపం వద్ద మహా అన్నదాన కార్యక్రమాన్ని కోటగుళ్ళు పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించారు. గణపతి మండపం వద్ద పూజా కార్యక్రమాలను కోటగుళ్లు పరిరక్షణ కమిటీ గౌరవ అధ్యక్షులు మామిండ్ల మల్లికార్జున్ గౌడ్ నిర్వహించారు.

అనంతరం మహా అన్నదాన కార్యక్రమాన్ని ఎంపీడీవో ఎల్.భాస్కర్, భూపాలపల్లి జిల్లా మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ రేపాక రాజేందర్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ కట్కూరి శ్రీనివాస్, బిఆర్ఎస్ మండల శాఖ అధ్యక్షుడు మోతే కరుణాకర్ రెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ పోలుసాని లక్ష్మీ నరసింహారావు, బైరగాని కుమారస్వామి గౌడ్ తదితరులు ప్రారంభించారు. అన్నదాన కార్యక్రమంలో పరిరక్షణ కమిటీ సభ్యులు, నాగపురి శ్రీనివాస్ గౌడ్, రౌతు కిషోర్, తోట నవీన్ కుమార్ ,కొయ్యల గౌతమ్ గౌడ్, బాలాజీ నవీన్, నాగరాజు, గొర్రె ఎల్లన్న, పెద్ది ప్రశాంత్ కాంబత్తుల ప్రభాకర్ యువసేన కమిటీ సభ్యులు పాల్గొన్నారు.