18-12-2025 04:28:29 PM
హైదరాబాద్: తెలంగాణలో జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ మద్దతుతో నూతనంగా ఎన్నికైన సర్పంచులతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ యాదాద్రి భువనగిరి జిల్లాలో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ... బీఆర్ఎస్ పార్టీకి మళ్లీ పూర్వ వైభవం రాబోతుందన్నారు. బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ మళ్లీ అధికారంలోకి రావాలని ప్రజలు కోరుకుంటున్నారని, ఇందుకు నిదర్శనం సర్పంచ్ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలే అని కొనియాడారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో బీఆర్ఎస్ 151 సర్పంచ్ స్థానాలను గెలుచుకుందని, దీంతో కేసీఆర్ పట్ల తెలంగాణ ప్రజలకు ఉన్న నమ్మకం చెక్కుచెదరలేదని కేటీఆర్ తెలిపారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏది చెబితే తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అది చేస్తున్నారని ఆరోపించారు. పోచారం శ్రీనివాస్ సహా మిగత ఎమ్మెల్యేలకు ముఖ్యం లేకుండాపోయిందని, రేవంత్ రెడ్డితో చేరి ఇంతకాలం ఉన్న పేరు చెడగొట్టుకున్నారని, పెద్ద పెద్ద మాటలు చెప్పే కడియం శ్రీహరి రాజీనామా అంటే పారిపోయారని కేటీఆర్ ఎద్దేవా చేశారు. మూడు అడుగులు ఉండే వ్యక్తి 30 మాటలు చెబుతున్నారని, మనల్ని ఎవరో ఓడించలేదు.. మనల్ని మనమే ఓడించుకున్నామని చెప్పారు. కిందిస్థాయి నాయకులను పట్టించుకోకపోవడం వల్లే బీఆర్ఎస్ ఓటమి చవిచూసిందని కేటీఆర్ వివరించారు.