calender_icon.png 23 November, 2025 | 3:05 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీసిన హరీష్ రావు

27-07-2024 02:12:50 PM

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. సభలో పలు అంశాలపై హరీష్ రావు ప్రభుత్వాన్ని నిలదీశారు. కాంగ్రెస్ నేతలకు తాము సృష్టించిన ఆస్తులు కనిపించడం లేదా? అని ప్రశ్నించారు. రుణమాఫీకి 31 వేల కోట్లని చెప్పి.. బడ్జెట్ లో 26 వేల కోట్లకు తగ్గించారని విమర్శించారు. కోతలు పెట్టేందుకు రుణమాఫీకి నిధులు తగ్గించారా..? అన్నారు. గతంలో కంటే ఆరోగ్యశ్రీకి నిధులు తగ్గించారని తెలిపారు. కేసీఆర్ కిట్, న్యూట్రిషన్ కిట్ లను కొనసాగించాలని హరీష్ రావు ప్రభుత్వాన్ని కోరారు.