calender_icon.png 23 November, 2025 | 3:19 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మేడారం పూజారి మృతి పట్ల మంత్రి సీతక్క దిగ్భ్రాంతి

27-07-2024 02:23:00 PM

హైదరాబాద్: ములుగు జిల్లా మేడారం పూజారి కాక సంపత్ మృతి  రాష్ట్ర పంచాయితీ రాజ్ గ్రామీణాభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క  తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ... గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతూ నిన్న తీవ్ర అస్వస్థతకు గురై మరణించడం భాదకరమని, ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి సంతాపం తెలిపారు. మృతుడి కుటుంబానికి అండగా ఉంటామని మంత్రి ఒక ప్రకటనలో తెలిపారు.