calender_icon.png 31 October, 2025 | 11:20 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలి

31-10-2025 01:27:34 AM

అధికారులకు కలెక్టర్ అభిలాష అభినవ్ ఆదేశం

నిర్మల్, అక్టోబర్ 30 (విజయక్రాంతి): జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కడెం, స్వర్ణ ప్రాజెక్టుల పరిసరాలకు ఎవరూ వెళ్లరాదని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ గురువారం తెలిపారు.  తుఫాను వర్షాల ప్రభావం వల్ల ప్రజలను అప్రమత్తంగా ఉండాలని ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం చదవకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. నదీ పరివాహక ప్రాంతాలు, వాగులు, లోతట్టు ప్రదేశాలకు ఎవరూ వెళ్లవద్దని, ముఖ్యంగా పశువుల కాపరులు తమ పశువులను నదివాగుల దారుల్లోకి తీసుకెళ్లకూడదని కలెక్టర్ సూచించారు.

ప్రజల ప్రాణాలు, ఆస్తు లు రక్షణలో భాగంగా అందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వరద నీటితో కడెం, గడ్డెన్న, స్వర్ణ ప్రాజెక్ట్ గేట్లు ఎత్తనున్న నేపథ్యంలో దిగువ గ్రామాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని స్పష్టం చేశారు. నదీ పరివాహక ప్రాంతాల్లోకి చేపలు పట్టేవారు, రైతులు, ఇతరులు వెళ్లకూడదని హెచ్చరించారు. జిల్లా యంత్రాంగం 24 గంటలు అప్రమత్తంగా ఉందని, ఎన్ డి ఆర్ ఎఫ్ టీంలు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తినా వెంటనే కలెక్టరేట్ కంట్రోల్ రూమ్ నంబర్ 91005 77132 ను సంప్రదించవచ్చని కలెక్టర్ పేర్కొన్నారు.