05-01-2026 02:04:35 AM
జిందగీ, ఓ జిందగీ !
నీ మీద నాకు చాలా ఫిర్యాదులున్నాయి
కానీ, నిన్ను వదులుకోలేను
నిజానికి నీవు, నన్నేమీ తక్కువ బాధపెట్టలేదు
నీవు నన్ను ప్రేమించకపోయినా,
నీవు లేనిది, ఒంటరిగా ప్రయాణం చేయలేను
******
ఈ పోరాటాలు ఎందుకని, ఎవరూ అడగరు
ఆకలి తెలిస్తే, అడిగిన వాడికి నిద్రపట్టదు
******
కాస్తా ఓపికపట్టు, ఆ ఒడ్డుకు చేరుతాను
అలలకు, అడ్డు రావడం అలవాటైంది కదా,
అందుకే, పడవ సాగడానికి కొంచెం టైం పడుతుంది
******
నా గుండె నీ దగ్గరే వుండిపోయింది
నా శ్వాస నీ వెంటే నడుస్తోంది
నీ వద్దకు రావడానికి
ఏ దారిని ఎక్కడని వెదకాలి.
నా చూపు నీ నిరీక్షణలోనే నిలిచిపోయింది !
నీవు లేకుండా జీవించలేనని కాదు,
నీవు లేకపోతే నాకు జీవితమే లేదు
******
జీవితం ఒక స్వప్నం, ఒక అశ్రు కణం
దాన్ని బుజ్జగించేటప్పుడు తెలుసుకోవాల్సింది ఒకటుంది
అది మనమీద అలిగిందా,
లేక మనతో విసిగిపోయిందా అనీ!
******
ఆఖరున ఒక మాట చెబుతాను
నీకు కనిపించే నేను,
అసలైన నేను కాను !