calender_icon.png 11 January, 2026 | 6:24 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఒక నవ్వు

05-01-2026 02:03:31 AM

ఒక నవ్వు- సూర్యప్రకాశం వంటిదే మరి,

ఇది దిన మంతటినీ వినూతనం చేస్తుంది!

ఇది- జీవితంలోని ఉన్నత శిఖరాలకు

కాంతిని అదనపు బహుమతిగా ఇస్తుంది!

ఆత్మ సంతోషంగా పెరుగుతూ ఆ నవ్వును వింటూ

దాని ధైర్యం దృఢమైనదనే 

అనుభూతిని కలుగజేస్తుంది,

ప్రజలందరినీ ఆహ్లాదపరిచే

ఒక నవ్వు- సూర్యప్రకాశం వంటిదే మరి!

ఒక నవ్వు- సంగీతం వంటిదే మరి,

ఇది- హృదయంలో తచ్చాడుతూ ఉండిపోతుంది

దీని శ్రావ్యతను ఆలకించినప్పుడు

జీవితంలోని చెడులన్నీ తరలివెళ్లిపోతాయి

ఆపై ఆనందాల ఆలోచనలు వస్తూ

కుశలాల పలకరింపుల కోసం

సంతోషభరితస్వరగమనికలతో 

గుమిగూడుతుంటాయి

జీవనాన్ని మధురం చేయడం కోసం

ఒక నవ్వు- సంగీతం వంటిదే మరి !!!

ఆంగ్ల మూలం:              

రిప్లీ డన్లాప్ సాండర్స్             

‘ఏ లాఫ్’ పద్యం