calender_icon.png 2 December, 2025 | 2:57 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బంగ్లా రైఫిల్స్ వెనుక హసీనా హస్తం!

02-12-2025 01:29:15 AM

  1. తిరుగుబాటుకు మాజీ ప్రధానే ఆదేశించినట్లు ఆరోపణలు 

అప్పటి ఆవామీ లీగ్ ప్రభుత్వ నేతలదీ ప్రత్యక్ష పాత్ర..

తీవ్ర ఆరోపణలు చేసిన దర్యాప్తు కమిషన్

డాకా, డిసెంబర్ 1: బంగ్లాదేశ్‌లో 16 ఏళ్ల క్రితం జరిగిన రైఫిల్స్ తిరుగుబాటు వెనుక ఆ దేశ మాజీ ప్రధాని షేక్ హసీనా హస్తం ఉ న్నట్లు దర్యాప్తు కమిషన్ తా జాగా ఆరోపించింది. హసీనానే తిరుగుబాటుకు స్వయంగా ఆదేశించారని విచారణలో తేలినట్లు పేర్కొం ది. బంగ్లాదేశ్ రైఫిల్ ఎటాక్ కేసులో ఢాకాలోని ఇంటర్నేషనల్ క్రైమ్ ట్రైబ్యునల్ ఆ దేశ మాజీ ప్రధాని షేక్ హసీనాకు మరణ శిక్ష వే సిన విషయం తెలిసిందే.

2009లో జరిగిన రైఫిల్స్ తిరుగుబాటు అప్పుడు బంగ్లా ఆర్మీ ని బలహీనపర్చేందుకు భారత్ మద్దతు ఇ చ్చిందని కమిషన్ ఆరోపించింది. గతేడాది హసీనా స్వదేశాన్ని వీడిన తర్వాత ఏర్పాటైన యూనస్ ప్రభుత్వం బంగ్లాదేశ్ రైఫిల్స్ తిరుగుబాటుపై దర్యాప్తునకు ఒక కమిషన్ వేసిం ది. విచారణ చేసిన కమిషన్ తాజాగా నివేదికను విడుదల చేసింది. హసీనా ఆదేశాలతో మాజీ ఎంపీ ఫజ్లే నూర్ తపోష్ తిరుగుబాటును ముందుండి నడిపించినట్లు పేర్కొం ది.

అప్పుడు జరిగిన హత్యలకు హసీనానే కారణమని  ఆరోపించింది. రైఫిల్స్ తిరుగుబాటు అప్పుడు హసీనాకు మద్దతుగా భా రత్ నిలిచిందని, బంగ్లాలో అస్థిరతను ప్రేరేపించిందని కమిషన్ తీవ్ర ఆరోపణలు చే సింది. కాగా విద్యార్థుల ఆందోళనతో ప్రధాని పదవి నుంచి దిగిపోయిన షేక్ హసీనా గతేడాది ఆగస్టులో బంగ్లాదేశ్ వీడి భారత్‌కు వచ్చింది. ఆ నాటి నుంచి  ఢిల్లీలోని ఓ రహస్య ప్రదేశంలో హసినా నివసిస్తున్నారు. ఆమె పలు కేసుల్లో దోషిగా ఉన్నందున తిరిగి బంగ్లాకు అప్పగించాలని ఆదేశ తాత్కాలిక ప్రభుత్వం అనేక సార్లు భారత్‌ను కోరింది.