12-07-2025 12:24:18 AM
పూజారిపై మహిళా కమిషన్‌కు ఎస్టీ మహిళ ఫిర్యాదు
బెల్లంపల్లి అర్బన్, జూలై 11 : బెల్లంపల్లి మండలంలోనీ బుగ్గ దేవాలయం పూజారి రాంబట్ల వేణుగోపాల శర్మ వ్యవహారం రోజు రోజుకీ ముదిరిపోతోంది. తనను వేధిస్తున్నాడంటూ బాధితురాలు గుండ భీమక్క ఇప్పటికే పూజారిపై రాష్ర్ట దేవదాయ శాఖ కమిషన్‌కి ఫిర్యాదు చేశారు. ఇదే విషయంపై ఆమె మహి ళా కమిషన్ కూడా కలిసి ఫిర్యాదు చేయడంతో పూజారి వివాదం మరింత రచ్చ రచ్చ అవుతున్నది.
కాసిపేట మండలం బుగ్గగూడెం గ్రామానికి చెందిన గుండ భీమక్క బుగ్గ దేవాలయంలో కొంతకాలంగా కొబ్బరికాయలు విక్రయిస్తున్నారు. తనపై అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడని, గుడి ప్రాంతానికి రావద్దనీ మరీ బెదిరింపులకు పాల్పడుతున్నాడని భీమక్క పూజారి రాంబట్ల వేణుగోపాల శర్మపై ఫిర్యాదు చేశారు.