calender_icon.png 19 July, 2025 | 7:17 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

48వ డివిజన్‌లో హెల్త్‌క్యాంప్

19-07-2025 12:58:03 AM

ఖమ్మం, జులై 18 (విజయ క్రాంతి):స్థానిక 48వ డివిజన్ లోని సమ్మక్క సారలమ్మ ఆలయ ప్రాంగణంలో శుక్రవారం నేషనల్ ఎలిమినేషన్ టిబి ప్రోగ్రాంలో భాగంగా మెగా హెల్త్ క్యాంప్ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా డివిజన్ కార్పొరేటర్ తోట గోవిందమ్మ రామారావు పాల్గొన్నారు.

ఈ మెగా హెల్త్ క్యాంపును ఉద్దేశించి కార్పొరేటర్ గోవిందమ్మ మాట్లాడుతూ టీ బి వ్యాధిగ్రస్తులకు తమ ప్రాంతానికి వచ్చి తగు మందులను, పోషకాహార సూచనలు చేసే విధంగా హెల్త్ క్యాంపును నిర్వహించడం చాలా ఆనందకరమైన విషయమని. ఏప్రిల్ 1 2018 నుంచి రిజిస్టర్డ్ అయినా ప్రతి టీ.బి. రోగికి వారి చికిత్స కాలం వరకు ఆహార పోషణ నిమిత్తం 1,000 నేరుగా లబ్ధిదారుల ఖాతాలో జమఆవుతాయని అధికారులు తెలియజేశారన్నారు.

కావున అటువంటి రోగులు ఈ సదవకాశాన్ని వినియోగించుకోవాలని వారు తెలియజేశారు.ఈ హెల్త్ క్యాంపులో ప్రముఖ వైద్యులు టీ.బి. రోగులతో పాటు సాధారణ సీజనల్ వ్యాధుల బాధితులకు కూడా పలు రకాల చికిత్సలను అందించి ఉచిత మందులను అందించడం జరిగింది.ఈ కార్యక్రమంలో డివిజన్ మాజీ కార్పొరేటర్ తోట రామారావు, మాజీ కౌన్సిల్ సభ్యులు వంగాల వెంకట్, డివిజన్ అధ్యక్షులు చేతి కృష్ణ, మైనారిటీ నాయకులు బాబా, డివిజన్ బాధ్యులు కిషన్ నాయక్,ఆశా కార్యకర్తలు అంగన్వాడీ టీచర్లు పాల్గొనడం జరిగింది.