calender_icon.png 30 August, 2025 | 3:52 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆరోగ్య తెలంగాణే లక్ష్యం

30-08-2025 02:06:08 AM

ఎన్నారై సలహా కమిటీ సభ్యుడు నంగి దేవేందర్ రెడ్డి

హైదరాబాద్, ఆగస్టు 29 (విజయక్రాంతి): ఆరోగ్య తెలంగాణే లక్ష్యంగా ప్రభు త్వం పనిచేస్తున్నదని తెలంగాణ ప్రభుత్వం ఎన్నారై సలహా కమిటీ సభ్యుడు నంగి దేవేందర్ రెడ్డి అన్నారు. ప్రపంచ ప్రఖ్యాత హాకీ క్రీడాకారుడు మేజర్ ధ్యాన్‌చంద్ జయంతిని జాతీయ క్రీడా దినోత్సవంగా జరుపుకోవ డం సంతోషంగా ఉందన్నారు. జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా గచ్చిబౌలి స్టే డియంలో నిర్వహించిన క్రీడా కార్యక్రమం లో - నంగి దేవేందర్ రెడ్డి ప్రత్యేకంగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ  జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా నిర్వహించే ఉత్సవాలకు హాజరు కావాలని క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్ శివసేన రెడ్డి, కమిటీ చైర్మన్, సలహా కమిటీ  సూచించారన్నారు. ఈ ఆహ్వానాన్ని గల్ఫ్, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రవాసులు అందుకున్న గౌరవంగా తాను భావిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తనను భాగస్వామిని చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు.

ఎన్నారై సలహా కమిటీ చైర్మన్ అంబాసిడర్ డాక్టర్, కమిటీ మెంబర్ వినోద్‌కుమార్, వైస్ చైర్మన్ మంద భీమ్‌రెడ్డికి ఈ సందర్భంగా ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఆరోగ్యకరమైన తెలంగాణను త యారు చేయాలనే లక్ష్యంతో కష్టపడి పనిచేస్తున్న  సీఎం రేవంత్‌రెడ్డి కృషి ప్రశంసనీ యమన్నారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మంత్రి వాకిటి శ్రీహరి, సాట్స్ చైర్మన్  శివసేనారెడ్డి, ఎండీ సోనిబాల, నిథం ప్రాసెసర్ గోవింద్ రాజ్,  డాక్టర్. నాగరాజు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు గవినోళ్ల గోపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.