30-08-2025 02:07:23 AM
రక్తనాళ రుప్చర్‌తో ప్రాణాపాయ స్థితి నుంచి రోగి ప్రాణాలను కాపాడిన వైద్యులు
హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 29 (విజయక్రాంతి): న్యూరోఫైబ్రోమాటోసిస్, కైఫో స్కోలియోసిస్‌తో బాధపడుతున్న 47 ఏళ్ల రోగి తాజాగా స్పున్ సర్జన్ డాక్టర్ సూర్యప్రకాశ్‌రావు వద్ద వెన్నెముక శస్త్రచికిత్స చేయిం చుకున్నారు. శస్త్రచికిత్స విజయవంతమైంది. రోగి ఫాలోఅప్ కోసం మళ్లీ హాస్పిటల్‌కు రాగా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఇ బ్బందులు గుర్తించి డాక్టర్.. పల్మొనాలజిస్ట్‌ని సంప్రదించాలని సూచించారు. పల్మనాలజిస్ట్ డాక్టర్ మేఘనారెడ్డి ఓపీ విభాగంలో రోగి అనూహ్యంగా కుప్పకూలారు.
అతడికి శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బంది ఎదు రై, రక్తపోటు పడిపోయింది. సెకన్ల వ్యవధిలోనే పరిస్థితి ప్రాణాపాయ స్థాయికి చేరుకు న్నాడు. అత్యవసర విభాగం వైద్య బృందం వెంటనే స్పందించి, ఇంట్యుబేషన్ చేసి ఆక్సిజన్ అందించి, ప్రాణాపాయ నివారణ చర్య లు చేపట్టారు. తక్షణంగా నిర్వహించిన స్కా నింగ్‌లో కుడి ఇంటర్నల్ మామరీ ఆర్టరీ ప్సూడో అన్యూరిజం రుప్చర్ అయి, ఛాతీ గుహలో భారీ రక్తస్రావం (హీమోథోరాక్స్) ఏర్పడింది. ఇది కుడి ఊపిరితిత్తిని పూర్తిగా కుంగిపోయేలా చేసింది.
వెంటనే రోగిని క్యాథ్ ల్యాబ్‌కు తరలించి, ఇంటర్‌వెన్షనల్ రేడియోలజిస్ట్ డాక్టర్ సాయితేజ సూపర్ సెలెక్టివ్ ఎంబోలైజేషన్ పద్ధతిలో కాయిల్స్, గ్లూ ఉపయోగించి రక్తస్రావాన్ని ఆపగలిగారు. రక్తస్రావం ఆగిన తర్వాత కూడా పరిస్థితి సులభం కాలేదు. శస్త్రచికిత్స చేయడానికి రోగి శరీర స్థితి అనుకూలంగా లేకపోవడంతో, వైద్యులు చెస్ట్ ట్యూబ్ ద్వారా స్ట్రెప్టోకైనేస్ థ్రోంబోలిటిక్ చికి త్స అందించారు. ఈ చికిత్స ద్వారా ఛాతీలో ఏర్పడిన రక్త గడ్డలు కరిగి, ఊపిరితిత్తి తిరిగి విస్తరించింది.
అనేక రోజుల, రోగి పూర్తిగా కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. కన్సల్టెంట్ పల్మనాలజిస్ట్ డా.మేఘనా రెడ్డి మాట్లాడుతూ ‘ఇలాంటి సందర్భాల్లో ప్రాణ రక్షణలో ప్రతి నిమిషం కీలకం. మొదటి ఐదు నిమిషాల్లో రోగికి శ్వాస సపోర్ట్, ప్రాణాపాయ నివారణ చర్యలు అందించడం వల్లే, తర్వాత చికిత్సలకు మార్గం సుగమమైంది’ అని పేర్కొన్నారు. డా.సూర్యప్రకాశ్ రావు మాట్లాడుతూ ‘రోగి ఇప్పటికే వెన్నెముక సమస్యలతో బలహీన స్థితిలో ఉండటం వల్ల, ఇలాం టి తీవ్రమైన రక్తస్రావం నుంచి బయటపడటం వైద్య బృందం విజయం’ అని తెలిపారు. ఇంటర్వెన్షనల్ రేడియోలజిస్ట్ సాయితేజ మట్లాడుతూ.. ప్సూడోఅన్యూరిజం రుప్చర్లు అరుదు అని అన్నారు.