30-08-2025 02:06:00 AM
15 కిలోమీటర్ల నిలిచిన వాహనాలు
ఆరుగంటల పాటు ప్రయాణికుల అవస్థలు
కామారెడ్డి, ఆగస్టు 29 (విజయక్రాంతి): భారీ వర్షాల కారణంగా కామారెడ్డి జిల్లాలోని 44 నంబర్ జాతీయ రహదారిపై భారీ ట్రాఫిక్ జామ్ అయ్యింది. భిక్కనూరు టోల్‌గేట్ వరకు సుమారు 15 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. రెండు రోజుల క్రితం కురిసిన భారీ వర్షాలకు టేక్రియాల్, సారంపల్లి, సదాశివ్‌నగర్ మండలం అడ్లూర్ పెద్ద చెరువు వద్ద, కామారెడ్డి మండలం క్యాసంపల్లి, భిక్కనూరు మండలం జంగంపల్లి వద్ద రోడ్లు కొట్టుకుపోయాయి.
ఈ నేపథ్యంలో బుధవారం నుంచి వాహపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. గురువారం గంటల కొద్ది నిలిచిపో యిన వాహనాలను పోలీసులు దారి మళ్లించారు. దీంతో శుక్రవారం సుమారు 6 గంటల పాటు ప్రయాణికులు ట్రాఫిక్‌లో చిక్కుకున్నారు. పోలీసులు దారి మళ్లించి ట్రాఫిక్‌ను పోలీసులు పునరుద్ధరించారు.