07-11-2025 12:32:06 AM
నేడు మరో ఇద్దరిపై ఎంక్వైరీ
12, 13 తేదీల్లో మరోసారి స్పీకర్ విచారణ
హైదరాబాద్, నవంబర్ 6 (విజయక్రాంతి) : పార్టీ ఫిరాయింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై గురువారం స్పీకర్ గడ్డం ప్రసా ద్‌కుమార్ విచారణ చేపట్టారు. ఈ విచారణలో ఎమ్మెల్యేల న్యాయవాదులు, పిటిష నర్ల న్యాయవాదులు తమ వాదనలు, క్రాస్ ఎగ్జామినేషన్ చేశారు. ఇటీవలనే నలుగురు ఎమ్మెల్యేల విచారణ పూర్తి చేసిన స్పీకర్ ప్రసాద్‌కుమార్.. గురువారం భద్రాచలం ఎ మ్మెల్యే తెల్లం వెంకట్రావ్, జగిత్యాల ఎమ్మల్యే సంజయ్‌కుమార్ తరఫున న్యాయవాదులు..
పిటిషనర్లుగా ఉన్న బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు కేపీ వివేకానందగౌడ్, జగదీష్‌రెడ్డి తరఫు న్యా యవాదుల మధ్య క్రాస్ ఎగ్జామినేషన్ జరిగింది. శుక్రవారం బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే జగదీ ష్‌రెడ్డి వర్సెస్ బాన్సువాడ ఎమ్మెల్యే పోచా రం శ్రీనివాస్‌రెడ్డి, ఆ తర్వాత బీఆర్‌ఎస్ ఎ మ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ వర్సెస్ ఎమ్మెల్యే అరికపూడి గాంధీ న్యాయవాదుల మధ్య వా దనలు, క్రాస్ ఎగ్జామినేషన్ జరగనుంది.
ఇక ఈనెల 12న కేపీ వివేకానంద వర్సెస్ తెల్లం వెంట్రావ్, జగదీష్‌రెడ్డి వర్సెస్ సంజయ్, 13న జగదీష్‌రెడ్డి వర్సెస్ పోచారకం శ్రీనివాస్‌రెడ్డి, కల్వకుంట్ల సంజయ్ వర్సెస్ అరిక పూడి గాంధీ న్యాయవాదుల మధ్య వాదనలు, క్రాస్ ఎగ్జామినేషన్ జరగనున్నది. స్పీక ర్ విచారణ సందర్భంగా అసెంబ్లీ ఆవరణలో ఆంక్షలు విధించారు. మీడియా, సంద ర్శకులు, రాజకీయ నేతలతో పాటు విచారణకు హాజరయ్యే వారిపైన కూడా ఆంక్షలు కొనసాగనున్నాయి. దీంతో అసెంబ్లీ పరిసరాల్లో పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు.