calender_icon.png 7 November, 2025 | 2:11 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సామాజిక సమస్యను అధిగమిద్దాం

07-11-2025 12:31:36 AM

కలెక్టర్ ప్రణయ్ కుమార్

నారాయణపేట, నవంబర్ 6 (విజయక్రాంతి) : దేశ పౌరుల సామాజిక బాధ్యతగా భావించి,  బాల్య వివాహాలు అనే సామాజిక సమస్యను   అదిగమించాలని శిక్షణ కలెక్టర్ ప్రణయ్ కుమార్ పిలుపునిచ్చారు. మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నారాయణపేట జిల్లా కేంద్రం ఎస్. ఆర్ గార్డెన్ లో పూజారులు, పాస్టర్లు, క్వాజీలు, ప్రింటింగ్ ప్రెస్ యజమానులు,

ఫంక్షన్ హల్ యజమానులు, సౌండ్ సిస్టమ్ యజమానులు, వంట మాస్టర్స్ తో  ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడారు. ప్రతి ఒక్కరూ బాల్య వివాహ రహిత సమాజం కోసం కృషి చేయాలనీ, నారాయణపేట జిల్లా అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలని, బాల్య వివాహ రహిత జిల్లాగా మారుద్దామని తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో శిక్షణ కలెక్టర్ ప్రణయ్ కుమార్, సి.ఐ శివ శంకర్, ఎస్.ఐ వెంకటేశ్వర్లు, డిప్యూటీ తహసీల్దార్ రామకృష్ణ, మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ అధికారులు శ్రీలత, నర్సింహులు, జిల్లా బాలల సంరక్షణ అధికారి కరిష్మ, అనిత, తిరుపతయ్య, నర్సిములు,కవిత, అశ్విని,  సంతోష, విజయ్ కుమార్, శ్రవణ్ కుమార్, లక్ష్మణ్ నాయక్, బాల్ రాజ్, భారతి, ఏ.వీ.ఏ నరేష్, విజన్ సంస్థ ప్రతినిధులు రవికుమార్, అనిత తదితరులు పాల్గొన్నారు.