02-09-2025 05:46:48 PM
ఘనంగా వైఎస్సార్ వర్ధంతి
నల్లగొండటౌన్,(విజయక్రాంతి): పేద ప్రజల జీవితాలలో వెలుగు నింపిన మహనీయుడు డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి అని నల్గొండ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, దివంగత నేత వైయస్సార్ 16వ వర్ధంతి సందర్భంగా మంగళవారం నల్గొండలోని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో వైయస్సార్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైయస్ రాజశేఖర్ రెడ్డి పేద ప్రజల సంక్షేమం కోసం అనేక పథకాలను అమలు చేశాడని అన్నారు. వైయస్సార్ ను స్ఫూర్తిగా తీసుకొని కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఆయన ఆశ సాధన కోసం కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ జూకూరి రమేష్, డిసిసిబి డైరెక్టర్ పాశం సంపత్ రెడ్డి, నాయకులు కత్తుల కోటి, కూసుకుంట్ల రాజిరెడ్డి,చిట్ల వెంకటేశం, మధుసూదన్ రెడ్డి, శ్యాంసుందర్, గాదరి రవి, దొంతినేని నాగేశ్వరరావు, కిన్నెర అంజి, యూత్ కాంగ్రెస్ నాయకులు మామిడి కార్తీక్, గాలి నాగరాజు, పెరిక అంజయ్య, పాదం అనిల్ తదితరులు పాల్గొన్నారు.