calender_icon.png 15 August, 2025 | 5:12 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సింగూర్ ప్రాజెక్టులోకి భారీగా వరద

15-08-2025 12:31:25 AM

  1. ప్రాజెక్టులోకి 7వేల క్యూసెక్కుల వరద నీరు

దిగువకు 7వేల క్యూసెక్కులు విడుదల

పరివాహక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచన

సంగారెడ్డి, ఆగస్టు 14(విజయక్రాంతి): భారీగా కురుస్తున్న వర్షాల కారణంగా ఎగువ నుండి సింగూరుకు వరద ప్రవాహం పెరుగుతోంది. ప్రాజెక్టులోకి  4,336 క్యూసెక్కుల వరద నీరు వస్తున్నట్లు అధికారులు తెలిపారు. దీంతో సింగూరు ప్రాజెక్టు రెండు గేట్లు ఎత్తి 7వేల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నట్లు సాగునీటి పారుదల శాఖ అధికారులు తెలిపారు.

ఇన్ఫ్లో 7వేల క్యూసెక్కులు రాగా.. అదే స్థాయిలో నీటిని వదలుతున్నారు. వరదప్రవాహం పెరుగుతున్న దృష్ట్యా మంజీరానది పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ముఖ్యంగా పశువులు, గొర్ల కాపరులు, చేపల వేటకు వెళ్ళేవారు నదిలోకి వెళ్లరాదని అధికారులు తెలిపారు.