calender_icon.png 15 August, 2025 | 4:19 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

28 వరకు ఐటీఐలో ప్రవేశాలు

15-08-2025 12:32:42 AM

సిద్దిపేట క్రైమ్, ఆగస్టు 14 : సిద్దిపేట జిల్లాలోని ఇర్కోడ్, దుబ్బాక, కుకునూరుపల్లిప్రభుత్వ ఐటీఐ కళాశాల్లో ఈ నెల 28 వరకు ప్రవేశాలను పొందవచ్చని ఆయా కళాశాలల ప్రిన్సిపాళ్లు తెలిపారు.ఇందుకుసంబంధించిన వాల్ పోస్టర్ ను పోలీస్ కమిషనర్ అనురాధ గురువారం ఆవిష్కరించారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

ఈ విద్య సంవత్సరం నుంచి ఏటీసీలో 6 కొత్త కోర్సులు ప్రారంభమవుతాయని ఆయా కళాశాల ప్రిన్సిపాల్‌లు తెలిపారు. మరిన్ని వివరాలకు సిద్దిపేట 9951968689, దుబ్బాక 8499084414, కుకునూరుపల్లి 8500465850 ఫోన్ ద్వారా సంప్రదించవచ్చని సూచించారు. కార్యక్రమంలో సిద్దిపేట, కుకునూరుపల్లి ఐటీఐ కళాశాలల ప్రిన్సిపాళ్లు రామానుజ, వెంకటరమణ, కంట్రోల్ రూమ్ ఇన్స్పెక్టర్ మల్లేశం గౌడ్, అసిస్టెంట్ లేబర్ కమిషనర్ శ్రీనివాస్ పాల్గొన్నారు.