05-08-2025 05:32:38 PM
హర్షం వ్యక్తం చేసిన రైతన్నలు
బాన్సువాడ,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా బాన్సువాడ డివిజన్ కేంద్రంలో మంగళవారం ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. గత కొన్ని రోజులుగా వర్షాలు లేక రైతులు వేసిన పంటలకు సాగునీరు లేక రైతులు ఆందోళనకు గురయ్యారు. నిజాంసాగర్ నీటిపైనే ఆధారపడిన రైతులు సాగుభూములు సాగు చేసుకుందామని ఇటు వర్షాలు లేక అటు నిజాం సాగర్ నీరు రాక రైతులు దిక్కు తోచని స్థితిలో ఉన్న రైతులకు మంగళవారం కురిసిన భారీ వర్షంతో కొంతమేర రైతులు ఊపిరి పీల్చుకున్నారు. పంటలు ఎండక ఈ వర్షపు నీటితోనైనా పంటలకు ఆగు నీరు రావడం రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర వాతావరణ శాఖ మరో రెండు మూడు రోజులు తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు బాగున్నాయని పేర్కొనడంతో రైతులు ఊపిరి పీల్చుకుంటున్నారు.