03-11-2025 07:49:29 PM
బిజెపి జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి
హుజురాబాద్,(విజయక్రాంతి): కరీంనగర్ జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిని హుజురాబాద్ కు తరలించాలని బిజెపి జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం హుజరాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిని స్థానిక బిజెపి శ్రేణులతో ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో హుజురాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిని బిజెపి ఆధ్వర్యంలో సందర్శించిన సమయంలో ఇక్కడి ఆసుపత్రిలో నెలకొన్న సమస్యలను వైద్యులు తెలియజేశారని,
ఆ సమస్యలను బండి సంజయ్ కుమార్ దృష్టికి తీసుకువెళ్తే ఆయన సానుకూలంగా స్పందించారన్నారు. నేడు ఆసుపత్రిలో నెలకొన్న సమస్యల పరిష్కారం కోసం ఒక కోటి 50 లక్షలు సి ఎస్ ఆర్ నిధులతో15 రకాల అవసరమైన వైద్య పరికరాలను , సామాగ్రిని అందించారని తెలిపారు. కరీంనగర్ జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి ప్రస్తుతం మెడికల్ కళాశాలకు కేటాయించినందున, అక్కడి ఆసుపత్రిని హుజురాబాద్ కు తరలించడానికి చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.