calender_icon.png 4 November, 2025 | 3:48 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రేగళ్ళ రోడ్డును పరిశీలించిన జిల్లా కలెక్టర్

03-11-2025 07:59:27 PM

మండల ప్రజల తరఫున కృతజ్ఞతలు

సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు రేసు ఎల్లయ్య

ఆళ్లపల్లి,(విజయక్రాంతి): రేగళ్ల, మర్కోడు గుట్ట బాటలపై దట్టమైన అటవీ ప్రాంతం మీదుగా అధ్వానంగా మారిన రహదారిలో భద్రాద్రి జిల్లా కలెక్టర్ జితేష్ వి.పాటిల్ ఆదివారం కలెక్టర్ స్థాయిలో ఎంతో శ్రమ చేసుకొని ప్రయాణికుల కష్టాలు తెలుసుకునేందుకు వాగులు వంకలు దాటుకుంటూ మార్గ గుండాన్ని క్షుణ్ణంగా  పరిశీలించుకుంటూ ప్రయాణం చేసినందుకు వారికి వారే సాటి అని సిపిఐ పార్టీ ఆళ్లపల్లి మండల కమిటీ తరఫున సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు వైస్ ఎంపీపీ రేసు ఎల్లయ్య సోమవారం ఓ ప్రకటనలో కలెక్టర్ కి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... ఏజెన్సీ ప్రాంత సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించే దానికోసం వారి వంతు కృషి చేయాలని కోరారు. ఇప్పటికే తను రహదారి తాత్కాలిక మరమ్మత్తుల కొరకు పనులు పునర్దించడానికి ఎస్టిమేషన్ వేయాలని అధికారులను ఆదేశించారని తెలిసిందని వారికి మా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అని అన్నారు.