03-11-2025 08:00:47 PM
సిర్గాపూర్ (విజయక్రాంతి): సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్ మండల పరిధిలోని నల్లవాగు ప్రాజెక్టులో ఈరోజు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం 2025-26 సంవత్సరానికి 100% రాయితీపై నల్లవాగు ప్రాజెక్ట్ లో చేప పిల్లల విడుదల కార్యక్రమంలో పాల్గొన్న నారాయణఖేడ్ ఎమ్మెల్యే పట్లోళ్ల సంజీవరెడ్డి. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ... ఈ సంవత్సరం చేప పిల్లలు మొత్తం 11 లక్షల 40 వేయిల చేప పిల్లలను ఈ సంవత్సరం విడుదల చేయడం జరిగిందనీ, ఈ సంవత్సరం విడుదల కొంచెం ఆలస్యం అయ్యింది దానికి వర్షాలు కురవడం అలాగే ఈసారి టెండర్లు కూడా తొందరగా పూర్తికాకపోవడం ముఖ్య కరణం అని ఎమ్మెల్యే అన్నారు.
గత బిఆర్ఎస్ ప్రభుత్వం అధికారం ఉన్నపుడు చేప పిల్లల కాంట్రాక్టర్లకు 128 కోట్ల రూపాయలు బాగా అయి ఉండడంతో వారు టెండర్లు వేయడానికి కాంట్రాక్టర్లు ముందుకు రాకపోగా వాళ్ళ బకాయిలను చెల్లించి మరలా ఇప్పుడు కాంట్రాక్టర్ టెండర్లు వేయడానికి ముందుకు రావడంతో కొంచెం ఆలస్యమైందని, ఇక ముందు అలా జరగదని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. తెలంగాణ రాష్ట్ర మస్త్యా శాఖ మంత్రి కూడా ఒక గంగ పుత్రుడని వారు కూడా ముదిరాజ్ బిడ్డ అని కాబట్టి గంగ పుత్రుల సమస్యలు వారికి అన్ని తెలుసు కాబట్టి మీ సమస్యలు అన్ని పరిష్కరిస్తారని ఎమ్మెల్యే అన్నారు.
చేపలు పెద్దగా అయ్యాక మీరే గ్రామ గ్రామాన తిరిగి అమ్మడానికి కావలసిన సదుపాయోగాలు ప్రభుత్వం కల్పిస్తుందని కావున ఎవరు కూడా దళారులకు తక్కువ ధరకు అమ్మరదని ఈ సందర్భంగా ఎమ్మెల్యే అన్నారు. పేదలకు 5 లక్షల రూపాయల ఇందిరమ్మ ఇండ్లను ప్రభుత్వం పేదలకు అందిస్తుందని కాబట్టి ఇలాంటి అవకాశం ఎవ్వరు కూడా వదులుకోవద్దని ప్రతి ఒక్కరు ఉపయోగించి కావాలని ఎమ్మెల్యే అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాటు గున్నల నర్సింలు, జిల్లా ఏడి, తదితర ఉన్నతాధికారులు, ప్రజలు, గంగ పుత్రులు, కాంగ్రెస్ పార్టీ మండల ముక్య నాయకులు, కార్యకర్తలు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.